పేదల సంపూర్ణ ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ చేయూత: ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

0
12 Views

వికారాబాద్ : పేదల సంపూర్ణ ఆరోగ్యానికి CMRF ఆర్థిక చేయూతనిస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూపాయలు ముప్పై రెండు లక్షల యాభై ఐదు వేల ఐదు వందలు విలువ గల 78 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. అనారోగ్యానికి గురైన సమయంలో పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యం అందించడానికి CMRF సీఎం సహాయనిధి ఎంతగానో తోడ్పాటును అందిస్తుందన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కల్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వోద్దన్నారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.