సామూహిక ఇఫ్తార్ లతో మత సామరస్యానికి నాంది : మంత్రి దామోదర్ రాజనర్సింహ

0
13 Views

జహీరాబాద్: సామూహిక ఇఫ్తార్లతో మత సమరస్యనికి ప్రతీకలుగా నిలుస్తాయని, మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపంగా ఉందని, కొందరు రాజకీయ స్వార్థంతో మతల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సోమవారం నాడు సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిధి జహీరాబాద్ పట్టణంలోని ఫ్రెండ్స్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిధులుగా మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్ష ఉన్న ముస్లిం నాయకులకు, పార్టీ శ్రేణులను మంత్రి, ఇంచార్జ్ చంద్రశేఖర్  ఖార్జురా పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ , నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ చంద్రశేఖర్  మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లింలకు చాలా పవిత్రమైందని నెల రోజులపాటు ముస్లిం సోదర సోదరీమణులు కఠోర దీక్షలతో ఉపవాసాలు ఉంటారని, మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని, కొందరు తమ స్వార్థంతో రాజకీయ లబ్ది కోసం మతల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి , నియోజకవర్గ ఇంచార్జ్ డా ఏ చంద్రశేఖర్ , తెలంగాణ రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి, జహీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ సాయి చరణ్ , పార్లమెంట్ నాయకులు ఉజ్వల్ రెడ్డి , కోహిర్ మండల జడ్పిటిసి గురుగబాయి రాందాస్ , జహీరాబాద్ మండల జడ్పిటిసి నాగిశెట్టి , ఝారసంగం ఎంపిపి దేవదాస్ , మొగుడం పల్లి ఎంపిపి ప్రియాంక గుండారెడ్డి, టిపిసిసి ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ బ్యాగారి రచయ్య , పట్టణ పార్టీ అధ్యక్షుడు కండేం నర్సింలు , మండలాల అధ్యక్షులు పి నర్సింహారెడ్డి , రామలింగ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , మొహమ్మద్ మాక్సుద్ అలీ , హన్మంత్ రావు , నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ ఆర్షద్ అలీ , కోహిర్ పట్టణ అధ్యక్షుడు శంషీర్ అలీ, బిలాల్ పూర్ సహకార బ్యాంక్ చైర్మైన్ సయ్యద్ రియాజ్, సత్వర్ సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు బాబా పటేల్, న్యాయవాది గోపాల్, న్యాల్కల్ మండల వైస్ ఎంపిపి మొహమ్మద్ గౌసోద్దీన్, సీనియర్ నాయకులు మొహమ్మద్ రఫియోద్దీన్ న్యాల్కల్, మాజీ వైస్ ఖాజా మియా, మనియర్ పల్లి రాజ్ కుమార్, బౌగి మల్లికార్జున్, జగదీష్ రెడ్డి, అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.