రైతులకు వచ్చిన కరువు కాలం తెచ్చింది కాదు… కాంగ్రెస్ తెచ్చింది: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

0
20 Views

వికారాబాద్: ప్రస్తుతం రైతులకు వచ్చిన కరువు కాలం తెచ్చింది కాదని కాంగ్రెస్ తెచ్చిందని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ముందు రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,. గత ప్రభుత్వాన్ని బదులం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చూస్తుందని, రైతుల పంటలు ఎండిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 24 గంటల కరెంట్ ఇస్తామని సగం కరెంట్ కూడా రైతులకు ఇవ్వడం లేదని మండి పడ్డారు. రైతులకు పెట్టుబడి సాయం రూ. 15 వేలు ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. మండుటెండల్లో రైతులకు నీళ్లు తాపే సోయి కాంగ్రెస్ వారికి లేదని మిషన్ భగీరథ నీటిని గత ప్రభుత్వం అందించిందని దాన్ని కొనసాగించలేని స్థితిలో కాంగ్రెస్ దద్దమ్మలు ఉన్నారన్నారు. ఎంపీ ఎన్నికలకు ముందు అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు కోడ్ ను సాకుగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తప్పని సరిగా బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పై బురద జల్లడం మాని ఎన్నికల హామీలను నెరవేర్చే విధంగా పని చేయాలని సూచించారు. ఈ దీక్షలు ఆరంభం మాత్రమేనని మా పార్టీ ఉద్యమ పార్టీని అని మళ్లీ ఉద్యమ బాట పడుతామని వేటాడి వెంటాడుతమని ఆయన స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ విజయ్ కుమార్ , నాయకులు ప్రభాకర్ రెడ్డి, మేక చంద్రశేఖర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాంరెడ్డి, అనంత్ రెడ్డి, గోపాల్, రామస్వామి, వేణుగోపాల్ రెడ్డి, రమేష్ గౌడ్, గిరీష్ కోఠారీ, సుభాన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.