నేను చేసిన పనులే స్వాగతం పలుకుతున్నాయి : మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి

0
12 Views

వికారాబాద్: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఐదేళ్ల క్రితం వరకు నేను చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు నన్ను పలకరిస్తున్నాయన్నాయని బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట్ మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 నుంచి 2019 వరకు తాను ఎంపీగా ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా చేవెళ్ల పరిధిలోని సుమారు 400 గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టానని ఆయన గుర్తు చేశారు. గత ఐదేళ్లలో ఇప్పటి ఎంపీ సామాన్య ప్రజలను పట్టించుకోలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా గ్రామాల్లోకి వెళ్లిన తనను నిరుపేదలు, ముసలి వాళ్ళు, మహిళలు తమకు పెన్షన్ సరిగ్గా అందడం లేదని వాపోతున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఐదు గ్యారంటీలు, ఆరు గ్యారంటీలు ప్రజల పలిట చెంప దెబ్బలుగా మారాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేశారు. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం కొలువు తీరబోతోందని ఆయన భీమా వ్యక్తం చేశారు. మోమిన్ పేట్ మండలంలోని చంద్రాయన్ పల్లి, కోల్ కొండ, అమ్రాదికుర్దు, మేకవనంపల్లి, రాళ్లగుడిపల్లి, టేకులపల్లి, మల్లారెడ్డి గూడెంలో ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగింది, ఇందులో బిజెపి నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్చార్జీలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.