ఖమ్మంలో కాంగ్రెస్ గుండాల దాడి సిగ్గుచేటు: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

0
166 Views

వికారాబాద్:ప్రజలను వరద సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంతో బాధితులను పరామర్శించడానికి, తగిన సాయం అందించి ధైర్యం చెప్పటానికి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం పట్టణంలో బొక్కలగడ్డ వరద బాధితుల దగ్గరకు వెళ్లిన మాజీ మంత్రులు హరీష్ రావు , సబితా ఇంద్ర రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్ , జగదీశ్ రెడ్డి , మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తో పాటు అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల మీద కాంగ్రెస్ గుండాలు దాడి చెయ్యటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ప్రజలకు సాయం చేయటం చేతగాక సాయం చెయ్యటానికి వచ్చిన BRS మాజీ మంత్రులపై వారి వాహనాలపై రాళ్ళ దాడి చేయటం కాంగ్రెస్ పనికిమాలిన చర్య, కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఇలాంటి ఎన్ని దాడులు చేసిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల పక్షాన ఉండి పోరాడుతామని స్పష్టం చేశారు.