ప్రభుత్వ వైఫల్యం వల్లే 9 మంది ప్రాణాలు పోయాయి: హరీష్ రావు

0
226 Views

అనంతగిరి డెస్క్ (ఖమ్మం) :  గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిందని, దీనికి కారణం ప్రభుత్వ వైఫల్యమని  హరీష్ రావు  ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో మాజీమంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.  హరీష్ రావు మాట్లాడుతూ, “ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇంతటి నష్టం జరిగిందని వరద బాధితులు కట్టుబట్టలు తప్ప ఏమీ లేకుండా  పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే నష్టం జరిగిందని 9 మంది ప్రాణాలు కోల్పోయారు,  ప్రభుత్వం వారిని  రక్షించడంలో విఫలమైంది” అని అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు,  కోల్పోయిన వస్తువులకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించాలని. వరద బాధితులకు కనీసం తాగునీళ్లు, అన్నం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది” అని అన్నారు.”ముఖ్యమంత్రి రాజకీయం చేయడం కంటే ప్రజల కోసం చర్యలు తీసుకోవాలని” అన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు కూడా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఎమ్మేల్యేలు ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వచ్చినప్పుడు దాడులు చేస్తారా? ఇది కాంగ్రెస్ పాలనా?” అని ప్రశ్నించారు. వరదలలో నష్టపోయిన పంటలకు రూ.30 వేల ఎకరానికి ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.