నిర్లక్ష్యంగా భోజనం వండిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలి

0
30 Views

తాండూర్: తాండూర్ నియోజకవర్గంలోని పెద్దముల్ మండలంలోని మంబాపూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 50 మంది విద్యార్థుల వరకు పురుగులతో కూడిన అన్నం పెట్టడం వల్ల అవస్థకు గురైన పట్టించుకోనటువంటి స్కూల్ హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేయాలని *PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్* డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు నాన్నమైన భోజనము పెట్టకుండా, బియ్యంను కనీసం కడగాకుండా అలాగే వండుతూ నిర్లక్ష్యంగా వంట నిర్వహిస్తున్న వ్యక్తుల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని దానితోపాటు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న వ్యక్తుల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది. పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థిని ,విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్తే మిమ్మల్ని స్కూల్ కు రానివ్వనని బెదిరిస్తున్న పాఠశాలలోని పీటీ సార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. జిల్లాలో విద్యాధికారులు అసలు సమస్యలను పట్టించుకోవడంలేదని,నిద్ర వ్యవస్థలో ఉన్నారని పేర్కొనడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి స్కూల్ ని సందర్శించాలని లేదంటే *PDSU జిల్లా కమిటీ* ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించడం జరిగింది.