గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన వివరాలను తప్పులు దొర్లకుండా ఆన్ లైన్ లో నమోదు చేయాలి: జిల్లా ఆదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

0
24 Views

వికారాబాద్:గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన వివరాలను తప్పులు దొర్లకుండా ఆన్ లైన్ లో నమోదు చేయాలని జిల్లా ఆదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు.గురువారం నవాబ్ పేట్ మండలంలోని నవాబ్ పెట్, చిట్టి గడ్డ, దాతాపూర్ గ్రామాల్లో ప్రజా పాలనలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల్లో గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించి డాటా ఎంట్రీ అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఆన్లైన్ డాటా ఎంట్రీ లో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు పొందే విధంగా డాటా ఎంట్రీ ని చేపట్టాలని ఆయన సూచించారు.అదనపు కలెక్టర్ తో పాటు జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, తాసిల్దార్ జయరాం ఎంపీఓ విజయ్ కుమార్ లతో పాటు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.