జిల్లా లో 4 రైతు వేదికలలో వీడియో క్లాస్ సిస్టం ఏర్పాటు:వ్యవసాయ శాఖ అధికారి గోపాల్

0
14 Views

వికారాబాద్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వీడియో కాన్ఫరెన్స్ సిస్టం ద్వారా రైతులకు రైతు వేదికల లో నుండి శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలు సలహాలను విని వారి సమస్యలను నివృతి. చేసుకొనుట కొరకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున వికారాబాద్ జిల్లా లో 4 రైతు వేదికలలో వీడియోకాస్ సిస్టం ఏర్పాటు చేయడమైనదని వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
కొడంగల్ నియోజకవర్గం బొంబ్రాస్ పేట్ రైతు వేదికలో తాండూర్ నియోజకవర్గంలోనికి యాలాల్ రైతు వేదికలలో వికారాబాద్ నియోజకవర్గనికి మోమిన్ పెట్ రైతు వేదికలో మరియు పరిగి నియోజకవర్గనికి గాను పూ డూరు రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ సిస్టంలు ఏర్పాటు చేయబడినవని ఆయన తెలిపారు.ప్రతి మంగళవారము ఈ రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 నుండి 11:30 వరకు నేరుగా వీక్షించే అవకాశం కలగజేశారు తేదీ:19-03-2024 నాడు ఉదయం 10 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ వారం వరిలో ప్రస్తుతం పాటించవలసిన మెలుకువ పై డాక్టర్ బి. శ్రీనివాస్ జగిత్యాల నుండి సూచనలను రైతులకు అందజేస్తారని తదుపరి ఆయిల్ ఫామ్ సాగులో తీసుకోవలసిన మెళకువలు గురించి డాక్టర్ రాజశేఖర్ శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం డిఎస్ రైతులకు సూచనలు సలహాలు ఇస్తారు. వేసవిలో సాగు చేసే కూరగాయలు వాటిపై వాడే పురుగుల మందులు అవశేషాల గురించి రైతులకు వివరిస్తారు ఈ కార్యక్రమము డాక్టర్ కె. కవిత రైతుల సందేహాలకు సమాధానం ఇస్తారు రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి పాల్గొన్నారు p కావున రైతులు తమ తమ రైతు వేదిక ల నుండి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపారు