ఝాన్సీని పరామర్శించిన ఈటెల రాజేందర్

0
57 Views

హైదరాబాద్:  వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు పెద్ద ఎత్తున భూములు అవసరం ఉంటుందని  మాజీ మంత్రి ఈటేల   రాజేందర్  అన్నారు. శుక్రవారం ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ ని  పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.   ప్రాక్టికల్ గా నేర్చుకునే కోర్సులు ఉంటాయని. అలాంటి రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయ భూమిని కోర్టు కోసం కేటాయించారన్నారు. కోర్టు కట్టవద్దని కానీ, కోర్టుకి వ్యతిరేకంగా ఏబీవీపీ ఉద్యమాలు చేయడలేదన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూములు అమ్ముకుంటున్నారని అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి కానీ కోర్టుకు లేవా? మా భూములు ఎందుకు ఇస్తున్నారు అని విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారని తెలిపారు. వారిపై పోలీసులు వ్యవహరించిన తీరు,
ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ ని పోలీసులు జుట్టుపట్టుకొని లాగి కింద పడవేసిన విధానం జుగుప్సాకరం అని ఆమేమీ మానవబాంబు కాదు, ధ్వంసం చేసే ఆమె కాదన్నారు.. పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఘటనా లో భాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.