ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బoదిగా నిర్వహించాలి: జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్. శంకర్

0
15 Views

వికారాబాద్:ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బoదిగా నిర్వహించాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్. శంకర్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వికారాబాద్ లో నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ విధానం పైన ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ అధికారులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జనరల్ లో 35, ఒకేషనల్ లో 13ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. జనరల్ ద్వితీయ సంవత్సరంలో 4177 మంది సైన్స్ విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులలో మొదటి సంవత్సరంలో 1352 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 1259 మంది ప్రాక్టికల్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు.  జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుండి ప్రారంభమవుతాయని అదేవిధంగా ఫిబ్రవరి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్, ప్రింటర్ తో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు రెండు సెషన్ల లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు బ్యాచ్ ల వారీగా, సబ్జెక్టుల వారీగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్, ప్రాక్టికల్ టైమ్ టేబుల్ వారు చదువుతున్న కళాశాల ప్రిన్సిపాళ్ళ దగ్గర నుండి పొందవచ్చునని అన్నారు.ప్రాక్టికల్ పరీక్షల సమయంలో విద్యార్థులు పరీక్ష సమయానికి కనీసం ఒక గంట ముందు చేరు కునేలా విద్యార్థులకు వారి తల్లి దండ్రులు సహకరించాలని అన్నారు.