మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి: మాజీ మంత్రి చంద్రశేఖర్

0
18 Views

వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలను వికారాబాద్ ఏరీయా ఆస్పత్రిలో పరామర్శించారు మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ. చంద్రశేఖర్  అంతకుముందు వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మృతుల కుటుంబాలతో కలిసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల కు సరైన రోడ్లు లేకపోవడం వల్లనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని, గిరిజన తండాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో పేద ప్రజలు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేసి ఉండడంతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆస్పత్రిలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు . సందర్భంగా ఆయన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పాండు గౌడ్ జిల్లాఉపాధ్యక్షులు రాఘవన్ నాయక్, ఎస్ సి మోర్చా జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, వికారాబాద్ పట్టణ ఇంచార్జి శివప్రసాద్, మాజీ కౌన్సిలర్ సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు