వికారాబాద్ లో హై స్పీడ్ కారు షెడ్యూన పడ్డది

0
40 Views

వికారాబాద్:  హైవే లో 100 స్పీడు లో దూసుకెళ్లిన కారు ఒక్కసారిగా స్పీడ్ తగ్గి ఏకంగా షెడ్డు కు పోయిన మాదిరిగా తయారయింది వికారాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి..     ఆరు నెలల క్రితం వికారాబాద్ నియోజకవర్గంలో కారు నిండి కిక్కిరిసి కన్పించిన బీఆర్ఎస్ పార్టీ ఒక్క సారిగా  పడిపోయి కనీసం మేము ఉన్నామని ఉనికిని కూడా చాటుకోలేక పోతుంది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలు ఏమి చేపట్టకపోవడం ఈ క్రమంలోనే క్యాడర్ చాలా వరకు కాంగ్రెస్ బిజెపి వైపు వెళ్లడంతో అసలు టిఆర్ఎస్ కేడర్ నియోజకవర్గం లో నిలుస్తుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ క్యాడర్ ను  కాపాడుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కింది స్థాయి నాయకుల్లో సైతం బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మన పరిస్థితి ఏంటి మనను నడిపించే నాయకుడు ఎవరు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త నాయకత్వంలో పనిచేస్తే బాగుంటుందని కొందరు ఉంటే ఉన్న నాయకుడే కలుపుకొని పోతే బాగుంటుందని మరికొందరు ఆలోచిస్తున్నారు . బీఆర్ఎస్ పెద్దల నుంచి మాత్రం వారికి ఎలాంటి స్పష్టమైన హామీ లభించకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటి అని సమాలోచనలో పడ్డారు.