ఉల్లాసంగా..ఉత్సాహంగా వికాస్ వినాయకుడి నిమజ్జనం

0
72 Views

వికారాబాద్: వికాస్ జూనియర్ కళాశాలలో ఐదు రోజుల పాటు పూజలందుకున్న గణనాతుడి నిమజ్జనం బుధవారం నాడు విద్యార్థుల ఆట పాటల మద్య ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగింది. కళాశాల ఆవరణలో ఐదు రోజుల పాటు ఘనంగా పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ఉట్టి కొట్టె కార్యక్రమం విద్యార్థుల డ్యాన్సులు, కేరింతల మద్య కొనసాగింది. కళాశాల నుండి బయలుదేరిన నిమజ్జన ర్యాలీ రామయ్యగూడా రోడ్డు ద్వారా మున్నూరు సోమారం చెరువు వరకు కొనసాగింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్,అధ్యాపకులు ప్రభాకర్ రెడ్డి,రాంచందర్,కృష్ణ, రమేశ్, శ్రీనివాస్,ఉమారాణి,వరలక్ష్మి,వనిత, విద్యార్థులు పాల్గొన్నారు.