జిల్లాలో అన్ని ప్రభుత్వ,ప్రైవేటు,ఎయిడెడ్ పాఠశాలలకు సెలవు:జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
61 Views

వికారాబాద్:జిల్లా లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా,అలాగే సోమవారం సైతం భారీ ,అతి భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు .అందువల్ల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల యజమాన్యాలు సోమవారం పాఠశాలలను తెరవవద్దని ఆయన ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ఆదేశాలను కాదని ఎవరైనా పాఠశాలలు తెరిచినట్లైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.