రేపు ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు:జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్

0
29 Views

వికారాబాద్:ఇంటర్ స్థాయి లో విద్యార్థులు ఇంగ్లీష్ బాష లో పట్టు సాధించేందుకు అనుగుణంగా ఈ సంవత్సరం తెలంగాణ ఇంటర్ బోర్డు తీసుకున్న చర్యలలో భాగంగా శుక్రవారం  16న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్. శంకర్ తెలిపారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష 20 మార్కులకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉదయం పూట ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం పూట ఒంటి గంట నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బ్యాచ్ కు 50 మంది చొప్పున ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బ్యాచ్ ల వివరాలు ప్రిన్సిపాళ్ళు విద్యార్థులకు తెలియజేయాలన్నారు అదేవిధంగా ఈనెల 17 న ఎథిక్స్ మరియు హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఇంతకు ముందు పరీక్ష వ్రాయని విద్యార్థులకు మాత్రమే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులకు ఎథిక్స్ పరీక్ష నిర్వహించడం జరుగదని అన్నారు. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు,పర్యావరణ విద్య పరీక్ష ఈనెల 19 వ తేదీన రెగ్యులర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 10 గంటల నుండి 1 వరకు నిర్వహిస్తామని అన్నారు. ఈ పరీక్షలు హాజరు కాని విద్యార్థులను ఫెయిల్ అయినట్లు గా ప్రకటించడం జరుగుతుందని అన్నారు. ఈ పరీక్షలు వారు చదువుతున్న కళాశాలలోనే హాజరు కావాలని అన్నారు. హాల్ టికెట్స్ కోసం విద్యార్థులు వారు చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్స్ ను సంప్రదించాలని అన్నారు.