కల్తీకల్లు అని నిర్ధారణకు రాలేదు…. డీపీఈవో విజయభాస్కర్….. మరి ప్రెస్ మిట్ ఎందుకు పెట్టినట్లు?

0
161 Views

వికారాబాద్ : పీరంపల్లిలో కల్తీకల్లు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదని, అది సీజినల్ వ్యాధుల వల్ల కావచ్చని డీపీఈవో విజయ భాస్కర్ తెలిపారు. శుక్రవారం కార్యాలయంలోొ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సంఘటన జరిగి మూడు రోజులు అవుతున్న ఇంకా ప్రజలు ఆసుపత్రికి రావడం కల్తీకల్లు అని నమ్మశక్యంగా లేదని తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తరువాత ఏది వాస్తవమో తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైతే కల్లు నిర్వాహకులుపై కేసు చేశామని రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ప్రెస్ మిట్ ఎందుకు…?

అధికారులకు స్పష్టత లేని సమయంలో కల్తీకల్లు కాదని అధికారులు ప్రెస్ మిట్ పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తుంది. సీజనల్ వాటర్ వల్ల సమస్య వచ్చిందని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తుంటే ఇప్పటికే మండల అధికారులు నీటి పరీక్షలు చేసి ఎలాంటి సమస్య నీటి ద్వారా లేదని తెల్చి చెప్పారు. అయితే డీఎంహెచ్ వో సైతం గురువారం కల్తీకల్లు బాధితులు కోలుకుంటున్నారని ప్రెస్ నోట్ రిలిజ్ చేసి ఆ తరువాత సీజనల్ వ్యాధులు అంటూ రెండు గంటల తరువాత మార్చి ఇవ్వడం ఒక అనుమానంఅయితే. ఓ డాక్టర్ కల్తీ కల్లు అని రిపోర్ట్ చెప్పకండి అని మరో డాక్టర్ కు చెప్పడం ఈ అనుమానంకు బలం చేకూరుతుంది. కల్లులో నిషేదిత మద్దు కలిసిందా …? లేక ఇంకా ఏమైనా బలమైన కారణం ఉందా…? ఎక్సైజ్ శాఖ పూర్తి ఆధారాలు డాక్టర్ల నుండి తీసుకోకుండా మున్ముందే ప్రెస్ మిట్ పెట్టడం ఏమిటి అనే కోణంలో అనుమానాలు తావిస్తుంది. తప్పు ఎవరూ చేశారు అనేది పక్కన పెడితే ఎవరిని కాపాడాలని ఈ ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా పీరంపల్లిలో కల్లు తయారు చేసే లైసెన్స్ లేకుండానే ఆ గ్రామంలోకి కల్లు ఎలా వచ్చిందనే చర్చ జరుగుతుంది.