ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నందు జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు:-

0
29 Views

వికారాబాద్ : జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయము వికారాబాదు నందు ఈనెల 17 శనివారం నాడు ఉదయము 10:30 గంII లకు ” జాబ్ మేళా “ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి అబ్దుస్ సుభాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయము ఫ్రభుత్వ
ఐ.టి.ఐ. క్యాంపస్, శుబాష్ నగర్ కాలనీ, వికారాబాదు నందు నెట్ జాబ్ మేళా నిర్వహించబడనని తెలియజేశారు. దాదాపు 50 సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఉద్యోగాల నియామకం కొరకు స్త్రీ పురుషులు అర్హులని అన్నారు. పదవ తరగతి ఆపై విద్యా అర్హత గల వారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలియజేశారు.ప్రఖ్యాత ప్రైవేటు పరిశ్రమల యజమాన్యము వారు తమ పరిశ్రమలకు అవసరమగు సిబందిని ఈ జాబ్ మేళ ద్వారా ఎన్నుకొందురని తెలిపారు. ఇతర వివరములకు జాబ్ మేళా నిర్వాహకుడు శ్రీ. మియా సాబ్ 9676047444 ను సంప్రదించవచ్చును. అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొని తగిన ఉద్యోగ అవకాశాలు పొందగలరన్నారు.