కేసీఆర్ డౌన్ డౌన్ …. యంగ్ లీడర్ జిందాబాద్ … విద్యార్థుల ఆందోళన పైలేట్ కు తాకిన సెగ

0
14 Views

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ అనంతపద్మనాభ కళాశాల విద్యార్థులు స్కాలర్ షిప్ ల కోసం రోడ్డెక్కగా నిన్నటి వరకు ఒకే దగ్గర ఉన్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యేను ఈ రోజు అందులో ఒకరిని డౌన్ డౌన్ అంటూ విద్యార్థులు అనగా మరో వ్యక్తిని యంగ్ లీడర్ జిందాబాద్ అంటూ నినాదించిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ అనంతపద్మనాభ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాల సమీపంలో విద్యార్థులు స్కాలర్షిప్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మిగతా కాలేజీల్లో కాలర్ షిప్ లు వస్తున్నాయని మా కాలేజీలో స్కాలర్షిప్లు రావడం లేదని పెద్ద ఎత్తున ఆందోళనకు  దిగారు. అదే విధంగా 11000 నుంచి 21 వేల వరకు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి నీ విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకు చేపట్టారు.

పైలేట్ కు తాకిన విద్యార్థుల సెగ

వికారాబాద్ శ్రీ అనంత పద్మనాభ కళాశాల విద్యార్థుల నిరసన సెగ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పై పడింది.ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లను ఫీజు రివర్మెంట్ ను వెంటనే విడుదల చేయించాలని కోరారు. హైదరాబాద్ నుంచి తాండూరు కు వెళ్తున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని విద్యార్థులు అడ్డుకొని నిరసన తెలిపారు.

తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడి సంజాయించే ప్రయత్నం చేశారు అయినా విద్యార్థులు వినకపోవడంతో ప్రిన్సిపాల్ తో మాట్లాడతానని ఎస్ఐపి కాలేజ్ లోపలికి వెళ్లిపోగా యంగ్ లీడర్ జిందాబాద్ అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు

కెసిఆర్ డౌన్డౌన్ టిఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

 

ఇదిలా ఉంటే విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం మద్దతు తెలుపకపోవడం చర్చనీయంశంగా మారింది.