డయల్ యువర్ చైర్ పర్సన్ కు కార్యక్రమానికి రాజీనామాల డిమాండ్

0
11 Views

వికారాబాద్ : వికారాబాద్ మునిసిపల్ లో చేపట్టి డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమం సోమవారం చేపట్టగా ముగ్గురు వ్యక్తులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ చైర్పర్సన్ కార్యక్రమానికి పలువురు కాల్స్ చేసి సమస్యలు విన్నవించుకున్నారు. మొత్తం 21 సమస్యలతో కూడిన కాల్స్ చేసి వారి సమస్యలు వివరించారు. ఐతే అందులో 3 కాల్స్ కొత్రెపలి వార్డు నుంచి రావడం,వారు రాజీనామా ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నించారు.రాజకీయ కాల్స్ అయితే తమ కార్యాలయానికి వచ్చి మాట్లాడాలని చైర్పర్సన్ మంజుల రమేష్ వారితో బదులిచ్చారు. ఈ కార్యక్రమం ప్రజల సమస్య పరిష్కారం కోసం చేపట్టడం జరిగిందన్నారు.