కొత్త గడి రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి:PDSU,POW సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం

0
18 Views

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్త గడి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో విద్యార్థినులకు 30 మంది వరకు జాండీస్ రావడం 250 మంది నుండి 300 మంది వరకు లక్షణాలు కనిపించడం అనేది పూర్తిగా పాఠశాల ప్రిన్సిపల్ ఇతర సిబ్బంది యొక్క వైఫల్యమైనని, ఈ నిర్లక్ష్యానికి కారణమైన ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలని PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ POW జిల్లా కార్యదర్శి వై గీత లు డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. గురుకుల పాఠశాలలోని పారిశుద్ధ్య లోపం ఉందని అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో కూడా విద్యార్థిని చనిపోయిన సంఘటన కూడా ఇదే హాస్టల్లో జరగడం జరిగిందని అట్టి విషయాన్ని కూడా కలెక్టర్ కి విన్నవించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా కమిటీ సభ్యులు శ్రీకాంత్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.