డబల్ ఓట్లు ఉన్న వారి ఇంటికి బి ఎల్ ఓ లు వెళ్లి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి వారి ఆమోదంతోనే  ఓటరు జాబితాలో పేర్లు  తొలగించాలి:  జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

0
16 Views

వికారాబాద్:ఓటరు జాబితాలో డబల్ ఓట్లు ఉన్న వారి ఇంటికి బి ఎల్ ఓ లు వెళ్లి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి వారి ఆమోదంతోనే  ఓటరు జాబితాలో పేర్లు  తొలగించాలని  జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ బూత్ స్థాయి అధికారులకు  ఆదేశించారు. శనివారము స్పెషల్ క్యంపైన్ డే సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గంలోని పులమద్ది 107, 108 పోలింగ్ కేంద్రలు  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా బూత్ లెవెల్ అధికారులు, క్షేత్రస్థాయి  సిబ్బంది చొరవ చూపాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు- చేర్పులకు వీలుగా పోలింగ్ బూత్ ల పరిధిలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ బూత్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పోలింగ్ కేంద్రంలో బి.ఎల్.ఓ. ల వద్ద ఓటరు జాబితా, అవసరం మేర ఫారం-6,7,8 అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు.కొత్తగా ఓటరు నమోదుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, పేరు మార్పు చేర్పుల పై మార్పులు కోరుతూ ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారా   అనే వివరాలు బి.ఎల్. ఒ లను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కూడా ప్రత్యేక శిబిరాలు అన్ని పోలింగ్ బూతులలో కొనసాగుతాయని, ఓటర్లు ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది, లేనిది పరిశీలించుకోవాలన్నారు. లేనివారు వెంటనే ఫారం-6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 18 సం. నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవడంలో అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ తాసిల్దార్, బి ఎల్ ఓ లు తదితరులు పాల్గోన్నారు.