మాదిగలు కమలానికి ఓటేసి కొండను భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

0

వికారాబాద్ : ఎస్సి వర్గీకరణ బిజెపితోనే సాధ్యమని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా అణిచివేతకు గురిచేసిందని ఆయన ఆరోపించారు. మాదిగలను రాజకీయంగా అణగదొక్కుతున్న కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఎవరు కూడా ఓటు వేయొద్దని ఆయన చెప్పారు.మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని హరిత రిసార్ట్ లో చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో కలిసి ఏర్పాటుచేసి ఆయన విలేకరుల సమావేశం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని చెప్పి కెసిఆర్ మాట తప్పారని ఆరోపించారు. అకారణంగా డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్య ను కెసిఆర్ భర్తరఫ్ చేసినట్టు చెప్పారు. దళితులకు ఎక్కడ మూడెకరాల భూమి ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మాదిగలను గత 30 సంవత్సరాలుగా మోసం చేస్తూ వచ్చిందని ఆరోపించారు. కానీ బిజెపి దళితులను అక్కున చేర్చుకుని, ఎస్సి వర్గీకరణకు మార్గం సుగమం చేసిందన్నారు. మూడోసారి ప్రధానమంత్రి అయ్యే నరేంద్ర మోడీకి అండగా మాదిగలు నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మాదిలంతా ఏ పార్టీలో ఉన్న కమలం పువ్వు ఓటు వేసి చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. బిజెపి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు. మాదిగల మేలు కోసం గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయ్యి బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. దేశం మొత్తం మోడీ వైపే చూస్తుందని అన్నారు. కావున ప్రజలందరూ కమలం పువ్వుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం, బిజెపి జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, మహాజన్ సోషల్ లిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.ఆనంద్, బిజెపి చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, సీనియర్ నాయకులు పాండు గౌడ్, పెద్దింటి నవీన్ కుమార్, వడ్ల నందు, కోటిపల్లి ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అనంతరం జిల్లా కేంద్రంలోని చిగుర్లపల్లి రమేష్ గ్రౌండ్ లో మాదిగ సామాజికవర్గం నాయకులు, కార్యకర్తలు తదితరులు సమావేశం నిర్వహించారు.