గర్ల్స్ హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

0
23 Views

వికారాబాద్ : గర్ల్స్ హాస్టల్ ను  ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆకస్మిక తనిఖీ చేశారు.  వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి లో గల BC గల్స్ హాస్టల్లను ఆకస్మికంగా తనిఖీ చేసి వంట గదిలో భోజనం , పరిసర ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, శుభ్రత పాటించాలని, హాస్టల్ లో విద్యుత్ దీపాలు చిన్నవిగా ఉన్నందున వాటిని వెంటనే మార్చి విద్యుత్ కాంతి సరిపోయే విధంగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని హాస్టల్ వార్డెన్ ను ఆదేశించారు.  కచ్చితంగా మెనూ పాటిస్తూ, విద్యార్థులకు సరిపడా పౌష్టిక ఆహారాన్ని అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట స్థానిక కౌన్సిలర్ అనంత్ రెడ్డి ఉన్నారు.