ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టే పనులు గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

0
26 Views

వికారాబాద్: ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టే పనులు గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం టేలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ (NREGS)ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టే పనులు పక్కా ప్రణాళిక తో ముందుకెళ్లాలని అధికారులకు ఆదేశించారు.గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులలో కూలీల సంఖ్యను పెంచుతూ జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని, గ్రామ పంచాయతి పనులలో లేబర్ సమీకరణ చేస్తూ పద్ధతి ప్రకారం పనులు చేపడితే అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చని అన్నారు.గ్రామ స్తాయి లో ఉండే అధికారులు ఎక్కువ మంది లేబర్ ను సమీకరించి బాగా పని చేసే వారిని పెట్టి అనుకున్న లక్ష్యం ప్రకారం పనులు జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. లేబర్ పనిచేసే చోట త్రాగు నీరు , ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలన్నారు .రైతులను ,గ్రామ ప్రజలను సమన్వయ పరుచుకుంటూ గ్రామానికి ఉపయోగపడే పనులు జరిగేటట్లు చూడాలన్నారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో లేబర్ ఉదయమే వెళ్లి 11 .30 గంటల వరకు ఇంటికి తిరిగి వెళ్ళే విదంగా అధికారులు మానిటరింగ్ చేయాలనీ అన్నారు.లేబర్ మొబిలైజేషన్ తక్కువ ఉన్న్న గ్రామాలలో ఎన్ ఆర్ ఇ జి ఎస్ పనులుఎక్కువ మంది లేబర్ ను పెట్టి పనులు చేయించాలన్నారు. లేబర్ తక్కువ ఉన్న గ్రామాలపై దృఫ్టి పెట్టి గ్రూప్ ఏర్పాటు చేసి లేబర్ సమావేశాలు నిర్వహించి అంచనా ప్రకారం ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచి గ్రామానికి ఉపయోగపడే పనులను పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. టెలి కాన్ఫరెన్సు లో డి ఆర్ డి ఎ శ్రీనివాసులు,జిల్లా పంచాయతీ అధికారి జయసుధ , ఏం పి డి ఓ లు ఏపిఓ లు సంబంధిత అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.