తల్లిదండ్రులు భయపడకండి…. పాఠశాలను అభివృద్ది చేస్తా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
168 Views

వికారాబాద్: తల్లిదండ్రులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అస్వస్థకు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారని రేపటి వరకు విద్యార్థులు అందరూ బాగవుతారని  తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్  అన్నారు. శుక్రవారం అనంతగిరి పల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని సమాచారం రావడంతో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి అక్కడి వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనంతగిరి పల్లి పాఠశాలకు వెళ్లిఅక్కడ పరిసరాలను పరిశీలించారు. కిచన్ హాల్, మరుగుదొడ్లు అన్ని పరిశీలించిన అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ. 2012లో నేను తీసుకొచ్చిన పాఠశాల అని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాఠశాలను ఎవరూ పట్టించుకోలేదన్నారు. పాఠశాలలో కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉందని, మరుగుదొడ్లు బాగు చేయాల్సి ఉందన్నారు. అవసరమైతే ప్రభుత్వ నిధులు లేక పోతే మా నిధులు లేదా కలెక్టర్ నిధుల ద్వారా వీటిని బాగు చేయడం జరుగుతుందన్నారు. నలుగురు విద్యార్థులు ఒక మంచం మీద పంటున్నారని ఇద్దరు విద్యార్థులు ఒక మంచం మీద పండే విధంగా కొత్త మంచాలు తెస్తామని, వార్డెన్ లేడని ఒక  ప్రిన్సిపాల్ ఉండడంతో కొంత ఇబ్బందిగా ఉందన్నారు.  స్పీకర్ వెంటా సంబంధిత శాఖల అధికారులు, డీఎంహెచ్వో పల్వన్ కుమార్, మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, నాయకులు సుధాకర్ రెడ్డి, రమేష్, కిషన్ నాయక్ , రాంచందర్ రెడ్డి, మురళి, ఆసిప్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు  ఉన్నారు.