రైతు కోసం వర్షం లెక్క చేయకుండా కాలినడకన వెళ్లిన తహసీల్దార్…. ఫిదా అవుతున్న రైతులు

0
40 Views

తాండూరు : వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తహసీల్దార్ విధులు నిర్వహించాడు.రైతు కృపధానం సాయంతో బురదలో 1 కిలోమీటర్ వరకు కాలినడకన ప్రయాణించి, ట్రాక్టర్ ఎక్కి తహసీల్దార్ గ్రామానికి చేరాడు.దీంతో ఆ గ్రామ అన్నదాతలు తహసీల్దార్ విధుల నిర్వహణలకు ఫిదా అయ్యారు.ఇందుకు సంబంధిత వివరాలు ఇలా ఉన్నాయి..వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలోని సర్వే నెంబర్ 162 లో 94ఎకరాల పైన ఇనాం భూమి ఉంది.80,70 ఏళ్ల నుంచి దళిత రైతులు సాగు చేస్తున్నారు.కొందరికి పాత పట్టా పుస్తకాలు కూడా ఉన్నాయి.కానీ ధరణి సమస్యతో నేటికీ కొత్త పట్టా పాస్ పుస్తకాలు రాలేదు.దీంతో కొన్ని ఏళ్ల నుంచి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలు అన్ని ధరణి మూలంగా దళిత రైతులు కోల్పోయారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు స్థానిక(తాండూరు )ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి భూ సమస్యను తీసుకెళ్లారు.ఎమ్మెల్యే వెంటనే స్పందించిన సర్వేనెంబర్ 162 లో ఉన్న భూసమస్యను పరిష్కరించి, అర్హులైన ప్రతి దళిత రైతుకు కొత్త పాస్ పుస్తకాలు అందజేయాలని ఆర్డీవో, తహసీల్దార్ లకు ఎమ్మెల్యే ఆదేశించారు.దీంతో శుక్రవారం బషీరాబాద్ తహసీల్దార్ వెంకటేశం తన సిబ్బందితో కలిసి సర్వే నెంబర్ 162లో ఉన్న ఇనాం భూములను పరిశీలిస్తుండు. ఇంతలోను వర్షం వచ్చింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తూ..క్షేత్రస్థాయిలో ఇనాం భూములను పరిశీలించారు.నేరుగా రైతుల ద్వారానే భూ సమస్యగల కారణాలు తెలుసుకొని, అర్హులైన ప్రతి రైతుకు కొత్త పట్టా పాస్ బుక్కులు ఇస్తామని హామీ ఇచ్చారు.ప్రతి రైతు పొలాల్లో మంచిగా పంట సాగులు చేశారని రైతులకు చేపి తహసీల్దార్ మురిచిపోయాడు.దీంతో రైతుల ముఖల్లో ఆనందాలు గెలిచాయి.ఇంతలోనే వర్షం తగ్గింది.కాలినడకబాట , పొలాలు బురద మాయంగా తయారైంది. రైతు కృపధానం సహాయంతో తహసీల్దార్ బురదలో 1 కిలోమీటర్ వరకు కాలినడకన ప్రయాణం చేస్తున్న క్రమంలో ట్రాక్టర్ వచ్చింది.ట్రాక్టర్ పై తహసీల్దార్ 2 కిలోమీటర్ల వరకు ప్రయాణం గ్రామానికి చేరారు.దీంతో సార్ విధులకు అన్నదాతలు ఫిదా అయి..తహసీల్దార్ కు రైతన్నలు కృతజ్ఞతలు తెలియజేశారు.