అల్లు అర్జున్ పై పరోక్షంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

0
229 Views

అనంతగిరిడెస్క్:హీరోలు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారని  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే పాత్రలు చేశారని.. ఇప్పుడు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారని మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తోందని.. పరోక్షంగా అల్లు అర్జున్ పై వ్యాఖ్యలు చేశారు.ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైఎస్ఆర్ సీపీ పార్టీ అభ్యర్ధి తరుపున ప్రచారం చేయడంతో ఈ వాఖ్యలు సోషల్ మీడీయాలో వైరల్ గా మారాయి. . సినిమా రంగానికి చెందిన వాడిగా ఇలాంటి చిత్రాల్లో నటించడానికి నేను ఇబ్బంది పడతాను అని ఆయన పేర్కొన్నారు.