ప్రజలు మధ్యాహ్నం బయటకు రాకండి.. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి: జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

0
18 Views

వికారాబాద్:ఉష్ణగ్రతలు భారీగా పెరుగుతున్న నేపద్యంలో మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న కారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జిల్లా కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా అధికారులు తగు సూచనలు చేయాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. ఎండల్లో పనిచేయడం, ఆటలాడటం చెప్పులు లేకుండా బయట తిరగడం వంటివి చేయవద్దని తెలిపారు. పార్క్ చేసిన వాహనాల్లోకి పిల్లలు, పెంపుడు జంతువులు వెళ్లకుండా చూడాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో వంటగదికి దూరంగా ఉండటం మంచిదని తెలిపారు. మద్యం, చాయ్‌, కాఫీ, స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండడం శ్రేయస్కారమన్నారు. శరీర ఉష్ణోగ్రతలు 40.5 సెంటిగ్రేడ్‌ కంటే ఎక్కువగా నమోదవడం, విపరీతమైన చెమట, దాహం వేయడం, మగత, బలహీనత, తలతిప్పడం, కండరాలు పట్టేయం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉంటూ వైద్యులను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.