ప్రజలు త్రాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

0
14 Views

వికారాబాద్: ప్రజలు త్రాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గం పరిధిలో త్రాగునీటి సరఫరా పై మిషన్ భగీరథ అధికారులతో  ప్రత్యేక అధికారి కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాగునీటి సరఫరా పై, బోర్ వెల్స్, చేతి పంపులపై సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. బోర్ వెల్స్, చేతి పంపులు పనిచేయనట్లయితే శనివారం లోపు మరమ్మత్తుల పనులు పూర్తి చేసి వినియోగంలోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు త్రాగునీరు అందించడంలో అలసత్వం వహించినట్లయితే అట్టి అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. మిషన్ భగీరథ నీరు అనివార్య కారణాలవల్ల నిలిచిపోయినట్లయితే ప్రత్యామ్నాయంగా నీటిని సమృద్ధిగా అందించే విధంగా కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మిషన్ భగీరథ, పంచాయత్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తూ మంచినీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో ఆ కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, తాండూర్ ఆర్డీవో శ్రీనివాసరావు, మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆంజనేయులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు బాబు శ్రీనివాసు, నాగేశ్వరరావు, తహసిల్దార్ విజయ్, మిషన్ భగీరథ ఏఈలు పాల్గొన్నారు.