వికలాంగులు సదరం సర్టిఫికెట్ కోసం ఈనెల 17 నుండి మీసేవా కేంద్రాలలో స్లాట్ బుక్ చేసుకోవాలి:జిల్లా కలెక్టర్ సి నాారాయణరెడ్డి

0
8 Views

వికారాబాద్:వికలాంగులకు సదరం క్యాంపుకు సంబంధించి శనివారము ఈనెల 17న ఉదయం 11.00 గంటల నుండి మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19,20,23,26,27 , మార్చి 08, 09,16,19,30 తేదీల్లో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు స్లాట్ బుక్ చేసుకున్న అంగవైకల్యం. బుద్ది మాంధ్యo,చెవుడు మూగ గల దరఖాస్తుదారులు హాజరుకావాలని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈనెల 20,21,23,27  మార్చి 06, 22,26,27 ల్లో వికారాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు నిర్వహించే  క్యాంపులకు అంగవైకల్యం,అంధులు.హాజరుకావాలని కలెక్టర్  తెలిపారు. ఇట్టి క్యాంపులకు సదరం సర్టిఫికెట్ పొంది సర్టిఫికేట్ కాల పరిమితి అయి పోయిన వారితో పాటు కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్న వారు హాజరు కావాలని కలెక్టర్  తెలిపారు.