ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయడం తమ అదృష్టంగా భావించాలి:జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి

0
20 Views

వికారాబాద్: ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయడం తమ అదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు.మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బదిలీపై వెళ్తున్న జిల్లా అధికారులకు ఆత్మీయ వీడుకోలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న జిల్లా అధికారులు సీఈఓ జానకి రెడ్డి, డిప్యూటీ సీఈవో సుభాషిని, డిపిఓ తరుణ్ కుమార్, డిఆర్డిఓ కృష్ణన్, డిడబ్ల్యుఓ లలిత కుమారి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, డిఎల్పిఓ అనిత లను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.ఆత్మీయ వీడుకోలు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలందించే క్రమంలో సంతృప్తిని కలిగిస్తుందని అన్నారు. పదిమందికి మేలు చేసినప్పుడే ఉద్యోగానికి న్యాయం చేసిన వారమవుతామని తెలిపారు. జిల్లాలో సమర్థవంతంగా పనిచేసిన అధికారులు బదిలీ అయినప్పటికీ ఉద్యోగ నిర్వహణలోఎక్కడికి వెళ్లినా కొత్త ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో కష్టపడి పనిచేసే అధికారులు బదిలీ అవుతున్న క్రమంలో బాధ ఉన్నప్పటికీ ఇప్పటివరకు జిల్లాకు మీరు అందించిన సేవలు సంతృప్తిని కలిగించిందని ఆయన అన్నారు. బదిలీ అయిన అధికారులు తాము పనిచేసే ప్రాంతాల్లో కూడా సిబ్బంది సహాయ సహకారాలతో ఉత్తమ సేవలందించాలని కలెక్టర్ అభిలాషించారు. ఉద్యోగులందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఉద్యోగానికి న్యాయం చేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఈఓ రేణుకా దేవి, డిసిఎస్ఓ రాజేశ్వర్, డీఎస్సీడబ్ల్యుఓ మల్లేశం, డిటిడబ్ల్యూ కోటాజి, డివైఎస్ఓ హనుమంతరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజస్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ అధికారి అనిల్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామి రెడ్డి, మిషన్ భగీరథ
ఇఇ చల్మారెడ్డి , డీఎంహెచ్ఓ పల్వన్ కుమార్, డిబిసిడబ్ల్యూఓ ఉపేందర్, డిఎల్పిఓ శంకర్ నాయక్, ఏంపివో నాగరాజు, జిల్లా అధికారులు, ఏంపిడీవోలు, ఎంపివో లు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.