నులి పురుగుల నివారణకు విద్యార్థులందరికీ మాత్రలు అందజేయాలి:జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

0
16 Views

వికారాబాద్:నులి పురుగుల నివారణకు విద్యార్థులందరికీ మాత్రలు అందించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.బుధవారం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 12వ తేదీన జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, వసతి గృహాలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, కళాశాలలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందించే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈనెల 19వ తేదీలోగా జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులందరికీ 100 శాతం నివారణ మాత్రలు అందించే లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా కృషి చేయాలని తెలిపారు. ప్రతి సంవత్సరం 1 నుండి 19 సంవత్సరాల వయసు వరకు రెండుసార్లు మాత్రలు అందించడం జరుగుతుందని, 2 సంవత్సరాల వయసు లోపు వారికి అర మాత్ర, 2 నుండి 19 సంవత్సరాల వయసు వారికి 1 మాత్ర అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మాత్ర వేసుకునే ముందు విద్యార్థులు భోజనం చేసే విధంగా ఉపాధ్యాయులు, అధికారులు పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా, అంగన్వాడి వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పాల్వన్ కుమార్, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి , జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, మెప్మా పీడీ రవికుమార్ , డిఐఓ డాక్టర్ బుచ్చిబాబు, స్టాటిస్టికల్ ఆఫీసర్ చంద్రశేఖర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.