నాటు సారా కేంద్రాలపై పోలీసుల దాడులు

0
78 Views

వికారాబాద్ : నాటు సారా కాస్తున్నారని పక్కా సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేసి పట్టుకున్న సంఘటన పెద్దేముల్  పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది . ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం  వికారాబాద్ జిల్లా ఎస్పీ కే. నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం తట్టేపల్లి గ్రామ శివారులో జాదవ్ చందర్ అనే వ్యక్తి తన పొలంలో రహస్యంగా నాటు సారా తయారు చేస్తున్నాడనే పక్కా సమాచారంతో శనివారం వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీస్ లు, పెద్దేముల్ ఎసై గిరి సిబ్బంది కలిసి సంయుక్తంగా దాడి చేయగా సుమారు 15 లీటర్ల నాటు సారా ను  నవసగరం స్వాధీనం చేసుకొన్నారు. 2 బ్యాలర్ల లో నిల్వ ఉంచిన సుమారు 150 లీటర్ల బెల్లం పానకం ను స్వాధీనం చేసుకొని, చందర్ అనే వ్యక్తి పై పెద్దేముల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు.