యాదగిరి గుట్టలో భక్తుల అవస్థలు … భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నన ఆర్టీసీ

0
11 Views

అనంతగిరి డెస్క్: యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో భక్తులు నిత్య నరకం అనుభవిస్తున్నారు. ముఖ్యంగా గుట్ట కింద నుంచి గుట్టపైకి వెళ్లేందుకు టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన అరకొర బస్సులు వారి ప్రాణాల మీదకు తీసుకొస్తున్నాయి. గుట్టపైన సరైన పార్కింగ్ సౌకర్యం లేక పోవడంతో కొన్ని వాహానాలు మాత్రమే గుట్టపైకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తుండగా మిగితా కార్లు పోవాలంటే రూ.500 లు పార్కింంగ్ ఫీజు కట్టాలని లేక పోతే ఆర్టీసీ ఉచిత బస్సులను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. పేద మధ్య తరగతి వారు అంత డబ్హులు పెట్టుకోలేక బస్సులను ఆశ్రయిస్తే అక్కడ గుట్టపైకి నడుస్తున్న అరకొర బస్సులతో ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆలయం నూతన దేవాలయం పూర్తియిన తరువాత గుట్టపైకి వెళ్లేందుకు  50 బస్యులు కేటాయించిన ఆర్టీసీ ఇప్పుడు కేవలం 7 బస్సు సర్వీసులు నడిపిస్తుంది. ఈ రోజు ఒక 5 సంవత్సరాల పాప బస్సు ఎక్కే స్థితిలో తోపులాటలో బస్సు టైరు కిందకు పోగా రెప్పా పాటులో ప్రాణాలతో బయట పడింది. ఈ మధ్యనే ఓ వ్యక్తి కాలు విరిగినట్లు తెలుస్తోంది.  అంతకు ముంందు భక్తులు సీట్ల కోసం రక్తాలు వచ్చేలా కొట్టుకున్నట్లుగా అక్కడిి వారు తెలిపారు. దైవ దర్శనం కోసం చిన్న్న పిల్లలు వృద్దులు మహిళలు వచ్చి బస్సుల కారణంగా ఇబ్బదులకు గురవుతున్నారు. డ్రైవర్ల ను ప్రశ్నిస్తే బస్సు సర్వీసులు లేక పోతే మేము ఏం చేస్తామని ప్రమాదాలు జరుగుతున్న మాట వాస్తవమేమని ఒప్పుకుంటున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ ఇప్పటికైనా స్పందించి యాదగిరి గుట్టలో బస్సు సర్వీసులు పెంచడంతో పాటు భక్తులు క్యూ లైన్ లో బస్సు ఎక్కేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.