పార్లమెంటు ఎన్నికలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలి: వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

0

వికారాబాద్:  పార్లమెంటు ఎన్నికలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు.పార్లమెంట్ ఎన్నికల విధులను నిర్వహించే సెక్టోరల్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ సిబ్బందికి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం పోస్టల్ బ్యాలెట్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్  పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఉన్నామని ఓటు వేయడంలో నిర్లక్ష్యం వహించకుండా తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని  సూచించారు. పోస్టల్ బ్యాలెట్ , హోమ్ ఓటింగ్, పిడబ్ల్యుడి ఓటింగ్ విషయం లో గోప్యతతో నిర్వహించాలని తెలిపారు . 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, 40% పైబడి ఉన్న అంగవైకల్య కలిగిన వారు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే క్రమంలో పోలీస్, డిపిఓ , పోలింగ్ అధికారి, బూతు స్థాయి అధికారులతో పాటు వీడియో గ్రాఫర్ తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పోస్టల్ బ్యాలెట్ శిక్షణ కార్యక్రమంలో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, డిపిఓ జయసుధ, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, ఎన్నికల మాస్టర్ ట్రైనర్స్ రామ్ రెడ్డి , వీరకాంతం లు పాల్గొన్నారు.