వాహనాల పన్ను బకాయిలను ఏప్రిల్ 30 లోగా చెల్లించాలి: జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరెడ్డి

0

వికారాబాద్: వాహనాల పన్ను బకాయిలను ఏప్రిల్ 30 లోగా చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరెడ్డి తెలిపారు. త్రైమాసిక పన్ను బకాయి చెల్లింపు వాహనాలకు ఏప్రిల్ 30 తేదీతో గడువు ముగుస్తుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని వాహనాల చెల్లింపులు మీ సేవలో గాని ఆన్ లైన్ లో గాని చెల్లించవచ్చని ఆయన అన్నారు, గడువు పూర్తయి పన్ను బకాయి చెల్లించని వాహనాలకు 200 శాతం అపరాధ రుసుము విధించబడుతుందని, పన్ను బకాయి చెల్లించని వాహనాలను మే 1వ తేదీ నుండి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి రుసుము చెల్లించేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో సుమారుగా 5000 వాహనాలకు సుమారుగా రెండు కోట్ల వరకు పన్ను బకాయిలు ఉన్నాయని ఆయన అన్నారు. పన్ను బకాయిలు చెల్లించని వాటిలో ఎక్కువగా ట్రాక్టర్ , ట్రైలర్ లు, భారీ వాహనాలు, మధ్య , చిన్న వాహనాలు, హార్వెస్టర్ ( వ్యవసాయ సంబంధిత) , రింగ్ మౌంటెడ్ వాహనాలు ( బోర్లు వేసే వాహనాలు) , గ్రామపంచాయతీ, మున్సిపల్ వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, స్కూలు బస్సులు , సీసీ (టూరిస్టు) బస్సులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇట్టి వాహనాల యజమానులు గడువులోగా పన్ను చెల్లించాలని, ఏదైనా సమాచారం కొరకు ఫోన్ నెంబర్ 9848528441 ను ద్వారా సంప్రదించవలసిందిగా ఆయన తెలిపారు.