మర్పల్లిలో వింతశకటం… ఆదిత్య 369సినిమాలో మాదిరిగా ఉన్న గుండ్రని భారీ శకటం

0
25 Views

వికారాబాద్ : మర్పల్లి మండల పరిదిలోని మొగ్గిలిగుండ్ల గ్రామలల్లో వింత పరికరం పడింది . ఈ పరికరానికి చుట్టు కెమరాలు ఉండగా ఫ్యారశుట్ మాదిరిగా ఉంది. దాన్ని చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చూడటానికి తరలివచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీీలిస్తున్నారు. ఆదిత్య 369సినిమాలో మాదిరిగా ఉన్న గుండ్రని భారీ శకటం ఎక్కడ నుంచో వచ్చి పంటపోలాల్లో పడింది. అయితే దీన్ని హైదరాబాద్ లోని టాటా ఇనిస్టిట్యూట్ వారు వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకునేందుకు ప్రయోగించినట్లు తెలుస్తోంది. సుమారు 80 కిలో మీటర్లు ప్రయాణించి ఇది పడిపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రామస్తులు పోలీసులకు స్థానిక తహసీల్దార్ కు సమాచారం అందించారు.