సమయ పాలన లోని బస్సులతో ఇబ్బందులు రోడ్డు పై ధర్నా నిర్వహించిన విద్యార్థులు

0
24 Views

ధారూర్ : ఆర్టీసీ సమయపాలన లోపం విద్యార్థులకు శాపంగా మారింది..
వికారాబాద్ డిపో ఆర్టీసీ సమయపాలన పాటించాలి అంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేశారు. ధారూర్ మండలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలోని విద్యార్థులు వికారాబాద్ ఆర్టీసీ సమయపాలన పాటించడం లేదంటూ ధారూర్ మండలం కేంద్రంలోని దోర్నాల్  ఆమ్ పల్లి, కుక్కిందా, హౌసుపల్లి, కొండాపురం, ధారూర్ స్టేషన్ ధారూర్ ర్ విద్యార్థులు ప్రధాన రహదారిపై బైటాయించి డిఎం డౌన్ డౌన్ నినాదాలు చేశారు.  ఈ యొక్క బస్సు సమయపాలన సమస్యలపై వెంటనే వికారాబాద్ డిపో మేనేజర్  స్పందించకపోతే వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా  ధర్నా చేస్తామన్నారు.  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్  మాట్లాడుతూ ధారూర్ మండలం కేంద్రంలో చుట్టుపక్కల పలు గ్రామాలలో నుండి వికారాబాద్ కు చదువుకోవడానికి వస్తున్నటువంటి విద్యార్థులకు వెంటనే ఈ యొక్క వికారాబాద్ జిల్లా డిపో మేనేజర్  సమాధానం చెప్పాలని ఆర్టీసీ సమయపాలన మితిమీరి వస్తే ఒకేసారి రెండు బస్సులు లేదా మూడు బస్సులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉదయం పాఠశాలకు కళాశాలలకు వెళ్లాలంటే ఉదయం 9 గంటల వరకు వేచి చూడాల్సి వస్తుందని అంతేకాదు సాయంత్రం 4 దాటితే చాలు అయితే చాలు మళ్లీ తిరిగి 7 గంటల వరకు బస్సులు రావట్లేదని విద్యార్థులు ఇంటికి వెళ్లేసరికి 7:30 రాత్రి 8 అవుతుందని ఈ యొక్క సమస్య పైన వెంటనే అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయకపోతే జిల్లా వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు చేస్తామని డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు జేరెడ్డి, రాజేష్, నందు, యాదేశ్ , శ్రీధర్, విద్యార్థులు ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.