ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్

0
10 Views

వికారాబాద్:రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ఏ.ఎం ఫిట్నెస్ ఇమ్రాన్ జిమ్ సెంటర్ లో జిమ్ నిర్వాహకులు ఇమ్రాన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విందులో పాల్గొన్న ఆయన ఇమ్రాన్ ఇతర ముస్లిం సోదరులకు ఫ్రూట్స్ అలాగే జ్యూస్ ఇచ్చి ఉపవాసాన్ని విరమింప చేశారు. అనంతరం శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ రోజా పేరుతో కటోర ఉపవాసం చేసే ముస్లిం సోదరు నియమా నిష్ఠలతో రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. తెలంగాణ అంటేనే గంగా యమునా తైజిబ్.. హిందూ, ముస్లిం సోదరులు అన్నదమ్ముల కలిసిమెలిసి రంజాన్ ఉపవాస దీక్షలలో పాల్గొనడం శుభ సూచికం అన్నారు. హిందూ ముస్లిం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని కోరారు. జిమ్ నిర్వాహకులు ఇమ్రాన్ ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందులో వికారాబాద్ పట్టణానికి చెందిన ముస్లిం సోదరులు రియాజ్, అమీర్, సుజిత్, మటమ్ల, పద్మాకర్, సంతోష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.