పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా రాజకీయ పార్టీల ప్రతినిదులు సహకరించాలి:జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

0
28 Views

వికారాబాద్:జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా రాజకీయ ప్రజా ప్రతినిధులు సహకరించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎన్నికల నియామవళి అమలు, విధివిధానాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆదివారం అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా సహకరించాలన్నారు.రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి ఎన్నికలు సాఫీగా, సజావుగా జరిగేలా సహకరించాలన్నారు. ఎన్నికల నియమావళి ని ఉల్లంఘన పాల్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా మని ఆయన అన్నారు. పార్టీలు గానీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీలు గాని అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ఎన్నికల నిబంధనల ఉల్లంఘనను పాల్పడకూడదని ఆయన సూచించారు.పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సౌకర్యాలను సమకూర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో వికారాబాద్ డిప్యూటీ తాహాసిల్దార్ రాజేందర్, బిజెపి, బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఎం ప్రతి నిధులతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.