ఎన్కేపల్లి భూముల కుంభకోణం పై చర్యలు తీసుకోండి; జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎన్కేపల్లి గ్రామస్తులు

0
42 Views

వికారాబాద్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఎన్కేపల్లి గ్రామంలో భారీ ఎత్తున భూ కుంభకోణం జరిగిందని, దానిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని మళ్లీ తిరిగి రైతులకు అప్పగించాలని ఎంకేపల్లి గ్రామ రైతులు తెలిపారు. గురువారం ఎన్కేపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు కలెక్టర్ కార్యాలయంలో భూ కుంభకోణం పై వినతిపత్రంతో పిర్యాదు చేసారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ…ఎన్కేపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 99, 101 లలో రూ.150 కోట్ల మేర లావాదేవీలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేక్ ఆర్మీ సర్టిఫికెట్లు సృష్టించి కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా పేదల భూమిని ఎకరాకు రెండు నుంచి పది లక్షల వరకు చెల్లించి కొంటున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆర్మీ సర్టిఫికెట్లు పెట్టి మళ్లీ భూమిని కోట్లల్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ జరిపి ఫేక్ ఆర్మీ సర్టిఫికెట్లను రద్దుచేసి ఈ భూమిని గ్రామస్తులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించి న్యాయం చేయాలని కోరారు. ఈ భూమిని అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్కేపల్లి భూములను కాపాడాలని కోరారు. రైతుల వద్ద నూతన భూమి పాసుబుక్కులో ఉన్నా కూడా వారిని దౌర్జన్యంగా భూముల్లో నుంచి వెళ్లగొట్టి కంచెలు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రైతులు నర్సింలు, చెన్నయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.