విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
62 Views

వికారాబాద్,  విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే విధంగా ఉపాధ్యాయుల కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం యంగ్ ఓరేటర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణ కేంద్రం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంత్ర, శిక్షా లోకం, భారత్ దేకో, అలోకిత్ సంస్థలు పాల్గొని మండల రిసోర్స్ పర్సన్ లు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యాలపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అన్ని పాఠ్యాంశాల బోధనతో పాటు ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థుల్లో మాతృభాషతోపాటు ఆంగ్లంలో కూడా మాట్లాడగలుగుతామనే విశ్వసాన్ని పెంపొందించాలని కలెక్టర్ తెలిపారు. వారంలో రెండు రోజులు ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యం పై ప్రత్యేక తరగతులు తీసుకోవాలని ఆయన సూచించారు. బోధించే సబ్జెక్టు పై ఉపాధ్యాయులకు పూర్తి పట్టు ఉన్నప్పుడే విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని ప్రదర్శింపజేయాలని కలెక్టర్ తెలిపారు. చిత్ర, సంభాషణతో పాటు వివిధ అంశాలతో పిల్లల్లో ఎలాంటి భయం లేకుండా ఇంగ్లీషులో మాట్లాడే విధంగా శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. యంగ్ ఓరేటర్స్ క్లబ్ నిర్వహిస్తున్న వర్క్ షాపు ఉపాధ్యాయులకు ఎంతగానో దోదపడుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ వర్క్ షాప్ కార్యక్రమానికి అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, నిర్వాహక ముఖ్యులు పవిత్ర, అభిజిత్ లతో సంస్థల సభ్యులు నిక్షిత్, మొహవిన్, యాన్నీ, ఎలిజిబెత్ తదితరులు పాల్గొన్నారు.