మట్టని దేవునిగా చేద్దాం భక్తిని పూజగా అర్పిద్దాం:జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
115 Views

వికారాబాద్: మట్టిని దేవునిగా చేద్దాం.. భక్తిని పూజగా అర్పిద్దామని ,పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను వినియోగించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
మంగళవారం పర్యావరణ విద్యా విభాగం, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన మట్టి గణపతులనే పూజిద్దాం అనే గోడ ప్రతిని జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పర్యావరణాన్ని పరి రక్షించడానికి మట్టి గణపతులనే పూజిద్దాం అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ని నిర్మూలించే దిశగా మట్టిచే చేయబడ్డ గణనాథులను ఏర్పాటు చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఉచిత మట్టి వినాయకులను పంపిణి బి సి సంక్షేమ అధికారు ల తో కలిసి పంపిణి చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజకు వినియోగించుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.వినాయక చవితి పండుగ సందర్బంగా జిల్లాలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టితో తయారు చేసిన వినాయకులను వాడాలని అన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను సమన్వయంతో భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని అన్నారు. రసాయనాలతో తయారుచేసిన విగ్రహాల వలన పర్యావరణం కలుషితం అవుతున్నదని, కాలుష్య నివారణకు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మట్టి వినాయకులను వినియోగించాలని అన్నారు.ఈ కార్యక్రమం లో బి సి వెల్ఫేర్ అధికారి ఉపేందర్ , పోల్యుషన్ కంట్రోల్ బోర్డు ఏ ఇ ఎస్ సురేష్, జనరల్ మేనేజర్ మహేశ్వర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.