బిజెపి ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ ల రద్దుకై పోరాటాన్ని ఉధృతం చేయాలి:IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి వై. గీత

0

వికారాబాద్:బిజెపి ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ ల రద్దుకై పోరాటాన్ని ఉధృతం చేయాలని FTU జిల్లా ప్రధాన కార్యదర్శి వై. గీత అన్నారు.బుదవారం వికారాబాద్ జిల్లా కేంద్రం క్లబ్ ఫంక్షన్ హాల్ లో IFTU ఆధ్వర్యంలో 138 వ మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించి అనంతరం మేడే సదస్సు IFTU జిల్లా నాయకులు మల్లేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి వై. గీత మాట్లాడుతూ….. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో 10 సంవత్సరాల పాలనలో పరిశ్రమల మూతపడి కార్మికుల బజార్నపడి కాంటాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు కరువై కోర్టు తీర్పులను పక్కనపెట్టి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లు గా కుదించి కార్మికులను కట్టు బానిసలుగా చేసే కుట్రకు వడిగట్టిందన్నారు.రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులను మోసం చేశాడన్నారు.కులం పేరుతో మతం పేరుతో రాముడు దేవుడి మందిరాల పేరుతో ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి అనేక మాయ మాటలు చెబుతూ మన ముందుకు వస్తున్నారు ఇలాంటి మోసపూరితమైన బిజెపి నరేంద్ర మోడీ మాటలు ప్రజలు కార్మికులు రైతులు నమ్మవద్దని అన్నారు.దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య ఐక్యతను శ్రమజీవుల మధ్య ఐక్యత పై దాడి చేస్తుందన్నారు కార్మిక వర్గం ఇటువంటి విభజన విధానాలను తిప్పికొట్టాలని బిజెపి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాల రద్దు ప్రభుత్వ రంగ సంస్థల ను ప్రవేటీకరణ వంటి కార్మిక వ్యతిరేక విధానాలపై మరియు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, స్కీం రంగాల కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కార్మిక వర్గం ఐక్యతను విస్తృతం చేసి బలమైన కార్మిక పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో PDSU అధ్యక్షులు శ్రీనివాస్ నాయకులు గోపాల్ శ్రీకాంత్ IFTU జిల్లా నాయకులు రాములు బసిరెడ్డి సత్తయ్య ప్రభావతి లక్ష్మమ్మ వివిధ రంగాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.