రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: బీజేపీ మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు యాష్కి శిరిషా

0
31 Views

వికారాబాద్: కోమరం బీమ్ జిల్లాలో ముస్లీం యువకుడు గిరిజన అమ్మాయిపై అత్యాచారం చేసి ఆపై చనిపోయిందని అనుకోని వెళ్లాడని మూడు రోజులు కోమలో ఉన్న అమ్మాయి జరిగిన విషయం చెప్పడంతో విషయం బయట పడిందని బీజేపీ జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలు యాష్కి శిరిషా పేర్కొన్నారు . గురువారం జిల్లా కేెంద్రంలో బీజేపీ మహిళ మోర్చ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంరక్షణను గాలి వదిలేసి హైడ్రా అనే పేరుతో డ్రామాలు చేస్తుందని మండిపడ్డారు. గిరిజన మహిళపై జరిగిన సంఘటనను సీరియస్ గా తీసుకొని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అని క్లాస్ డ్రామా తప్పిస్తే అభివృద్దిపై మహిళల భద్రతపై దృష్టి సారించడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోక పోతే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షుడు గోవింద్ నాయక్ , నాయకులు నరోత్తం రెడ్డి, రాజేందర్ రెడ్డి, బుస్సా శ్రీకాంత్ , చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు