చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా విశ్వేశ్వర్ రెడ్డి , బీజేేపీ తొలి జాబితాలో చోటు

0
20 Views

అనంతగిరి డెస్క్: వచ్చే లోక్ సభ ఎన్నికలకు బీజేేపీ పార్టీ సిద్దమైంది . బీజేపీ అధిష్టానం మొదటి విడతలో లోక్ సభ ఎన్నికల కోసం 195 మందితో తొలి జాబితా ప్రకటించగా తెలంగాణ నుండి 9 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన చేసింది. చేవెళ్ల పార్లమెంట్ నుండి అందరూ అనుకున్నట్లుగానే మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డిని  పేరును ప్రకటించింది. కరీంనగర్  నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి అరవింద్, జహీరాబాద్ బీబీ పాటిల్, మల్కాజ్ గిరి ఈటేల రాజేందర్ , సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, హైదరాబాద్ మాధవి లత , నాగర్ కర్నూల్ పి. భరత్ , భువనగిరి నర్సయ్య గౌడ్ కు మొదటి విడతలోనే స్థానం కల్పించింది.

ఉద్యమ నాయకుడు … మచ్చలేని నేత విశ్వేశ్వర్ రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి కేసీఆర్ కు అన్ని విధాలుగా సహకరించారు మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి. ఆ తరువాత చేవెళ్ల ఎంపీగా గెలుపొంది చేవెళ్ల ప్రాంత అభివృద్ది కోసం నిరంతరం కృషి చేశారు. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలుతో పాటు అవసరమైన చోట రైల్వే బ్రిడ్డిలు ఏర్పాటుకు చేసేందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేక పోవడంతో ఆ పనులు ముందు వెళ్లలేదు . స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి ఓడి పోయిన విశ్వేశ్వర్ రెడ్డి తన సిద్దాంతలకు వ్యక్తిత్వానికి దగ్గరైన బీజేపీ పార్టీలో చేరి పని చేస్తూ వస్తున్నారు. ఇది గుర్తించిన బీజేపీ అధిష్టానం విశ్వేశ్వర్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. చేవెళ్ల ప్రాంతంలో ప్రస్తుతం బీజేపీ పార్టీ అన్ని విధాలుగా బలంగా కనిపిస్తుంది. అయోధ్య రామ మందిర నిర్మాణం తరువాత ఏ గ్రామంలో చూసిన ఏ ఇంటిలో చూసిన జై శ్రీ రామ్ మరో సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడం కనిపిస్తుంది. ఈ తరుణంలోనే లోక్ సభ ఎన్నికలు రావడం దానికి మచ్చలేని నాయకుడు, అభివృద్దిని ఆకాంక్షించే విశ్వేశ్వర్ రెడ్డి బరిలో ఉండడం చేవెళ్ల స్థానం బీజేపీ గెలుస్తోందని బీజేపీ నాయకులు దృడమైన సంకల్పంతో ఉన్నారు. మరి వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల గడ్డ పై ఎవరూ జెండా ఎగురవేస్తారో వేచి చూడాలి.