ప్రభుత్వ భూమి వేలంపాటను అడ్డుకుంటాం : మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్

0
18 Views

వికారాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కన్ను విరారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి మీద పడిందని ఇక్కడి భూములను అమ్మేందుకు సిద్ధమైందని, వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను టీఆర్ఎస్ పా ర్టీ అమ్ముకుంటుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆయన నివాసంలో నాయకులతో కలిసి నిలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

స్వాతంత్యం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు 23 లక్షల ఎకరాల భూమిని పేదలకు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హౌసింగ్ బోర్డు ఏర్పాటుచేసిందని, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇచ్చిందన్నారు. రాజీవ్ స్వగృహా ద్వారా నామినల్ కొంత ధర నిర్ణయించి పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందించాలని చూసిందన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత హౌసింగ్ బోర్డు వ్యవస్థను మూసి వేసి అందులో పనిచేసే ఉద్యోగులను బీరు ప్యాక్టరీలలో పనికి పెట్టిందన్నారు. మొన్నటి మొన్న కోకాపేటలో ఎకరా 100 కోట్లకు అమ్మి వందల కోట్లు ప్రభుత్వం సొమ్ము చేసుకుందని ఇప్పుడు వికారాబాద్ ప్రభుత్వ భూమిని అమ్మేందుకు వేలం పాట నిర్వహిస్తున్నారన్నారు. ఈ మధ్య కాలంలోనే నవాబుపేట మండలం ఆర్యతల వద్ద 800 ఎకరాలను కొనుగోలు చేసి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వాళ్ల  దోస్తులకు అమ్ముకున్నారన్నారు. వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన లావణి పట్టాలకు భూములు అమ్ముకునేలా ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవో తెస్తామని చెప్పడం జరిగిందన్నారు.

జిల్లా కలెక్టర్ నిఖిల రోజు 50లక్షలు సంచుల్లో తీసుకపోతుందని కానీ ఏసీబీ, సీబీ, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆమె వెంటా ఎవరూ ఉన్నారో తెలియాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారా మంత్రు లు ఉన్నారా లేక కేటీఆర్, కేసీఆర్లు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారులు అవినీతి పాలన సాగిస్తున్నారన్నారు. కలెక్టర్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. వికారాబాద్లో ఆలంపల్లి, గంగారం బూములకు చట్టపరంగా వేలం పాట జరుగకుండా అడ్డుకుంటామని పేర్కొన్నారు. త్వరలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు ఆనంతరెడ్డి, కృష్ణారెడ్డి, , కిషన్ నాయక రత్నారెడ్డి, రఘువీరా రెడ్డి,  ఎర్రపల్లి జాఫర్, రాజశేఖర్ రెడ్డి, మురళి, లక్ష్మణ్, భారేద్, శ్రీనివాస్ మందిరాజ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.