పార్లమెంట్ పరిధిలోని ‘రైల్వే స్టేషన్ల”ను ఎప్పుడూ అభివృద్ధి చేస్తారు?–ఎంపీరంజిత్ రెడ్డి

0
21 Views

న్యూ ఢిల్లీ: నా పార్లమెంట్ పరిధిలోని ‘రైల్వే స్టేషన్ల”ను ఎప్పుడూ అభివృద్ధి చేస్తారని చేవెళ్ల  ఎంపీ రంజిత్ రెడ్డి పార్లమెంట్ లో గల మెత్తారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంటి?వాటిని ఎప్పటి వరకు అభివృద్ధి చేస్తారు..అని బీఆర్ఎస్(చేవెళ్ల)ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి ఈ రోజు లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాత పూర్వక సమాధానం తెలిపారు.

చేవెళ్ల లోక్ సభ పరిధిలోకి వచ్చే లింగంపల్లి, శంకర్‌పల్లి, తాండూరు, ఉద్గరీ మరియు వికారాబాద్ రైల్వే స్టేషన్‌లను” ఆదర్శ్ స్టేషన్ పథకం” కింద అభివృద్ధి చేసేందుకు గుర్తించారా? ..
ఒక వేళా గుర్తిస్తే పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి పైన పేర్కొన్న ప్రతి స్టేషన్‌లో స్టేషన్ల వారీగా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు ఏవి?

ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఎంత సమయానికి పూర్తవుతాయి అని ఎంపీ రంజిత్ రెడ్డి పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు.