గుజరాత్ లో కాంగ్రెస్ పరిస్థితికి AAP కారణమా ?

0
23 Views

అనంతగిరి డెస్క్ : గుజరాత్ లో కాంగ్రెస్ పరిస్థితికి AAP కారణమా ? అవునా?… ఈ చార్టులను చూస్తే అర్ధం అవుతుంది . గుజరాత్ లో BJP కి వచ్చిన ఫలితం పూర్తిగా decisive , clear cut.

AAP – కాంగ్రెస్ ఓట్లను కలిపి , కాంగ్రెస్ కు ఇచ్చినా కాంగ్రెస్ సీట్లు 55 మాత్రమే . అంటే ఓడిపోయినట్లే . అంతే కాదు . 2017 కన్నా తక్కువ సీట్లు వచ్చినట్లే . Exact గా ఈ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లో 2019 పరిస్థితి వంటిదే . జనసేన – TDP కలిసి పోటీ చేసి ఉన్నా , YSRCP నే అధికారంలోకి వచ్చి ఉండేది . కాకపోతే కొన్ని సీట్లు తగ్గి ఉండేవి .

ఇప్పుడు అలాంటి పరిస్థితే గుజరాత్ లో కూడా చూడవచ్చు . AAP పోటీ చేయకుండా ఉండి ఉంటే , AAP ఓట్లన్నీ కాంగ్రెస్ కే పడి ఉంటే కూడా BJP కి 123 సీట్లు వచ్చి ఉండేవి . 2017 కన్నా ఎక్కువే ఈ 123 సీట్లు కూడా .

కాంగ్రెస్ ప్రజలు తమ నుండి ఎలాంటి ఆర్ధిక , సామాజిక విధానాలను ఆశిస్తున్నారు ? BJP వ్యతిరేక ఓటర్ల ను అర్ధం చేసుకోవడంలో తమ పార్టీ ఎక్కడ విఫలమవుతుంది ?

బహుశా ఇదే exercise ఆంధ్రప్రదేశ్ లో TDP కూడా చేసుకోవాల్సి ఉంటుంది . ప్రత్యర్ధుల విజయాన్ని వక్రీకరించటం వలన అసలు కే మోసమని, ఓట్లు రాలవని గ్రహించాలి.